Saturday, November 23, 2024

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష

జార్ఖండ్‌ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బంధు తిర్కీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ కేసు నమోదు చేయగా.. రాంచీలోని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పీకే శర్మ కేసును విచారించి, తీర్పును వెలువరించారు. తిర్కీ ఆదాయానికి మంచి రూ.6.28లక్షలు సంపాదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2010 ఆగస్ట్‌ 1న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బంధు తిర్కీపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement