సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు వారసుల హవా కొనసాగుతోంది. కాగా ఇప్పుడు రాజకీయనాయకులు వారసులు కూడా సినిమావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే రాజకీయనాయకులు వారసులు ఎక్కువగా కన్నడ చిత్రాల్లో మెరుస్తుంటారు. ఈ ట్రెండ్ ఎక్కువగా కర్ణాటకలో కొనసాగుతూ ఉంటుంది. మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జాగ్వార్ టైటిల్ తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కర్ణాటక నుంచే మరో రాజకీయ సినీ వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు మూలాలు ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి , తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కీరీటి రెడ్డి హీరోగా.. కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. కొడుకుని హీరోగా పరిచయం చేయడం కోసం గాలి జనార్ధన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తేన్నాడు. దాని కోసం తన తనయుడిని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పటికే కిరీటి రెడ్డికి డాన్స్,యాక్టింగ్,ఫైటింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా స్పెషల్ కోచింగ్ కూడా ఇప్పించారట. హీరోగా కిరీట్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. కన్నడ డైరెక్టర్ రాధా కృష్ణ ఇప్పటికే అక్కడ మాయాబజార్ లాంటి సినిమాలను తెరకెక్కించారు. కిరీటి రెడ్డితో రాధాకృష్ణ చేయబోయే మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. దీని కోసం భారీ బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..