సహనం కోల్పొయారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు అక్కడ భారీగా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారు. దాంతో పోలీసులు, బాడీగార్డులు అందరినీ పక్కకు నెడుతూ ఆయనను కారు దగ్గరికి తీసుకొస్తున్నారు.అదే సమయంలో ఓ మద్ధతుదారుడు సిద్ధరామయ్యను కలిసే ప్రయత్నం చేశాడు. మరింత దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా సిద్ధరామయ్య అతడి చెంపపై కొట్టాడు. అనంతరం అతనితో ఏదో మాట్లాడి కారువైపు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా చెంపదెబ్బ తిన్న మద్దతుదారుడు కూడా సిద్ధరామయ్య వెనుకాలే నవ్వుతూ కారు దగ్గరికి వెళ్లాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement