బిజెపిలో చేరారు కేంద్ర మాజీ మంత్రి.. జనతాదళ్ మాజీ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్. అవినీతి ఆరోపణలపై ఆయనని పార్టీ సమాధానం కోరడంతో గత ఏడాది ఆగస్టులో జేడీయూ నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్సీపీ సింగ్ ప్రకటించారు. పార్టీ పంపిన షోకాజ్ నోటీసుల్లో స్థిరాస్తుల్లో వ్యత్యాసాలపై ఆర్సీపీ సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. వీలైనంత తొందరగా వాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయన పార్టీని వీడారు.నలంద జిల్లాలోని జనతాదళ్ (యు)కు చెందిన ఇద్దరు సహచరుల నుంచి ఆధారాలతో ఫిర్యాదు అందిందని పార్టీ తన షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. 2013-2022 మధ్య (ఆర్సీపీ సింగ్) పేరు మీద నమోదైన స్థిరాస్తులు, అతడి కుటుంబ సభ్యుల పేరిట నమోదైన స్థిరాస్తుల్లో వ్యత్యాసాలు కనిపించాయని వారు పేర్కొన్నట్టు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement