వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. కేసు వివరాల్లోకి వెళ్తే బ్యాంక్ సీఈవో హోదాలో 2012లో వీడియోకాన్ గ్రూప్ కు రూ. 3,250 కోట్ల రుణాన్ని చందా కొచ్చర్ మంజూరు చేశారు. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ఈ వ్యవహారం ద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని అభియోగాలు మోపింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement