తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ. పంట కోతకు రావడంతో స్వయంగా కొడవలి పట్టారు. కూలీలతో కలిసి తాను కూడా వరికోతల్లో పాల్గొన్నారు. తన పొలంలో నాలుగు రకాల స్థానిక వరి రకాలను పండించానని లక్ష్మీనారాయణ తెలిపారు. అది కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేశామని వివరించారు. నేడు కోతలు జరుగుతున్నాయని చెప్పారు. జనసేన పార్టీని వీడిన ఆయన ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వ్యవసాయంపై మక్కువతో కొడవలి చేత పట్టారు.
రాజకీయం వద్దు.. వ్యవసాయమే ముద్దు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..
Advertisement
తాజా వార్తలు
Advertisement