– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బిహార్‌లోని చంపాపూర్ జిల్లాకు చెందిన నితీష్ కుమార్ (జూన్ 18, 2023న) తన ఇంట్లోకి పొడవాటి పాము రావడాన్ని గమనించాడు. ఈ పాముని రెచ్చగొట్టగొట్టకుండా అతను రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. తాను నీళ్లు తాగబోతుండగా ఓ మూలన పొడవాటి పాము కనిపించిందని నితీష్ తెలిపాడు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించానని, కొద్ది నిమిషాల్లోనే నలుగురు అటవీ అధికారులు వచ్చి ఆ పాముని తీసుకెళ్లినట్టు నితీష్ చెప్పాడు. ఈ కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి స్నేక్ హ్యాండ్లర్లకు 30 నిమిషాల సమయం పట్టిందని తెలిపాడు.
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వానాకాలం సీజన్లో వర్షం కురిసిన తర్వాత పాములు వాటి బొరియల నుంచి బయటకు వస్తాయి. దాని బొరియలు నీటితో నిండిన తర్వాత అవి సురక్షితమైన స్థలాన్ని వెతుకుతూ బయటకు వస్తాయి.. వాస్తవానికి భారతదేశానికి చెందిన కింగ్ కోబ్రా ఇప్పుడు ఆసియాలో మాత్రమే కనిపిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. గరిష్టంగా 5.85 మీటర్ల పొడవు, సగటు పొడవు 3.18 నుండి 4 మీటర్ల వరకు ఉంటుంది. జాతుల రూపాన్ని దాని పర్యావరణాన్ని బట్టి నలుపు, తెలుపు చారల నుండి ఏకరీతి గోధుమ బూడిద రంగులోకి మారుతుందని వివరించారు.