చనిపోయిన పెద్ద పులిని గుర్తించారు అటవీశాఖ అధికారులు. కాగా అది ఆడపులిగా గుర్తించారు. ఈ సంఘటన అస్సాం కజిరంగాలోని సిల్దబీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పలువురు దుండగులు ఉద్దేశ్యపూర్వకంగానే పులికి ఆహారంలో విషం కలిపినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. దీనిపై విచారణ చేసేందుకు అటవీశాఖ అధికారులు ఆవు కళేబరాల నుంచి నమూనాలను కూడా తీసుకున్నారు. పులి చనిపోయే ముందు వాంతులు చేసుకుందని, అందులో విషం కలిపిన ఆనవాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ గ్రామం కజిరంగా నేషనల్ పార్క్‌లో రెండవ చేరికలో ఉన్నందున, ఇది పెద్ద టైగర్ హోమ్‌గా పరిగణించబడుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement