హైదరాబాద్ ఇంటి యాజమానులకు కండిషన్ పెట్టారు శంషాబాద్ డీసీపీ ఎన్.. ప్రకాష్ రెడ్డి. విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇచ్చేముందు వారి నుండి సి ఫామ్ ని తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వారు తీసుకున్న సి ఫామ్ ని ఆన్ లైన్ లో సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని… అద్దెకు వున్న విదేశీయుల పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని చెప్పారు. విదేశీయులు చట్ట వ్యతిరేక మైన పనులు చేస్తే వాళ్ల పై.. ఇళ్లు అద్దెకు ఇచ్చిన యాజమాన్యం పై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు….
కాగా వారిలో నైజీరియా, కాంగో, సోమాలియా, సుడాన్ దేశస్థులుగా గుర్తించామని వెల్లడించారు. విసాలు ముగిసినా అక్రమంగా ఇండియాలో వుంటున్న వారిని FRRO ముందు ప్రవేశ పెట్టనున్నామని… అక్కడి నుండి వారిని విదేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతాలలో 200 మంది విదేశీయులు వున్నట్లు గుర్తించాం. వారి వారి విసాలు, పాస్ పోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని..చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..