Saturday, November 23, 2024

హిజాబ్ వివాదం వెనుక ఐఎస్ఐఎస్ కుట్ర‌: కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్య

క‌ర్ణాట‌క‌లో సంచలనం రేపిన హిజాబ్ వివాదంపై కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌లో చెల‌రేగుతోన్న హిజాబ్ వివాదం వెనుక ఐఎస్ఐఎస్‌తో పాటు ప‌లు అంతర్జాతీయ సంస్థల కుట్ర‌ ఉందని ఆరోపించారు. ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నారని, ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయని చెప్పారు. వేగంగా ఈ నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారంటూ ఆయ‌న ప్రశ్నించారు.

కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ సంస్థ కూడా ఈ వివాదం వెనుక ఉంద‌ని మంత్రి ఆరోపించారు. చిన్నారులు ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కాకూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. పిల్ల‌లు ఇళ్లలో ఏమైనా చేసుకోవచ్చని, అయితే, విద్యా సంస్థ‌ల్లో మాత్రం విద్య‌పైనే దృష్టి పెట్టాలని ఆయ‌న హిత‌వు ప‌లికారు. హిజాబ్‌పై చెల‌రేగుతోన్న‌ వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి తాము ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదని ఆయ‌న తెలిపారు. హిజాబ్ వివాదంపై సమగ్రవిచారణ జరగాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement