Friday, November 22, 2024

గ‌త 24ఏళ్లుగా కొబ్బ‌రి.. నీళ్లే అత‌ని ఆహారం

గ‌త 24ఏళ్లుగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవ‌లం కొబ్బరి మాత్ర‌మే తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు బాల‌కృష్ణ‌న్ అనే వ్య‌క్తి. కేవ‌లం కొబ్బరి తింటూ, కొబ్బరి నీరు తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఈ ఆసక్తికర విషయాన్ని నటి, ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్సర్ షెనాజ్ ట్రెజరీ సామాజిక మాధ్యమంపై ఇతరులతో పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానని, మరి ప్రొటీన్ మాటేమిటి? అని ఆమె ప్రశ్నించారు. బాలకృష్ణన్ చాలా బలహీన పడిపోవడంతో వైద్యులను సంప్రదించగా, అతడికి జెర్డ్ సమస్య ఉన్నట్టు బయటపడింది. ఈ సమస్యతో ఆహారం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాడు. దీంతో సంప్రదాయ ఆహారాన్ని పూర్తిగా మానేసి, కొబ్బరి తిని, నీరు తాగడాన్ని బాలకృష్ణ తన దినచర్యగా మార్చుకున్నాడు.

కొబ్బరిలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మినరల్స్ ను వీటితో కోల్పోయిన శక్తిని తిరిగి పొందాడు. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యానికి కొబ్బరి సాయపడుతుంది. పీహెచ్ ను బ్యాలన్స్ చేస్తుంది. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ ను నియంత్రిస్తుంది. కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, అచ్చం కొబ్బరి తింటూ అధిక కాలం జీవించి ఉండడం అందరికీ సాధ్యపడదని వైద్యులు అంటున్నారు. కొబ్బరి నీరు తాగుతూ, కేవలం కొబ్బరే తినేవారు పొటాషియం పెరగకుండా చూసుకోవాలన్నది వైద్యుల సూచన. లేదంటే అధిక పొటాషియంతో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు పెరుగుతుందంటున్నారు. అయితే ఆహారం తీసుకోకుండా కేవ‌లం కొబ్బ‌రినీళ్లు..కొబ్బ‌రేతో అత‌ను కాలాన్ని నెట్టుకొస్తున్నాడంటే ఆశ్య‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే.దాంతో ఇప్పుడు బాల‌కృష్ణ‌న్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement