రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తూ… ముందుకు సాగుతోంది.. ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకుంటూ రష్యా దూసుకెళ్తోంది. ప్రపంచ దేశాలు సైతం ఉక్రెయిన్ కు సహకరించడం లేదు. యుద్ద ట్యాంకర్లు, యుద్ద విమానాలతో పెద్ద పట్టణాలపై దాడులు చేయడంతో రాజధాని వంటి నగరాన్ని సైతం రష్యా ఆధీనంలోకి వచ్చింది. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు తగ్గేదేలే అన్నట్లుగా ముందుకెళ్తున్నారు..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ భేరి మోగించింది.. మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన కాసేపటికే.. యుద్ధ ట్యాంకులు, మిలటరీ దాడులు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలతో పాటు తాను కూడా కదనరంగంలోకి కాలుమోపారు. ఇలా మిలటరీ డ్రెస్ వేసుకుని.. ఆర్మీ ఫ్రంట్‌లైన్‌ను సందర్శించారు. ఇలా ఓ వైపు ప్రపంచ దేశాల సహాయం కోరినా.. ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాకపోయినా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం భయపడకుండా యుద్దానికి తాను కూడా సిద్ధమంటూ మిలటరీ డ్రెస్ లో ముందుకెళ్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital