మధ్యప్రదేశ్‌లోని మోవ్ ప్రాంతంలో ఉన్న మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఇండియన్ ఆర్మీ ఇటీవల క్వాంటమ్ ల్యాబ్, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏర్పాటు చేసింది. క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయడానికి, ట్రైనింగ్ కోసం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ సాయంతో ఈ లేబొరేటరీని ఆర్మీ ఏర్పాటు చేసింది.
క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీపై రీసెర్చ్ చేయనున్నారు. ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను కూడా ఆర్మీ ఏర్పాటు చేసింది. సైబర్ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారు.