Tuesday, November 26, 2024

15-18 ఏళ్ల చిన్నారులకు నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇదిగో వీడియో..

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా నేటి నుంచి మరో కీలక ఘట్టం ప్రారంభం కాబోతున్నది. దేశంలో ఇవ్వాల్టి (సోమవారం) నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా చిన్నారుల కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. నేటి నుంచి తొలిసారి టీనేజ్‌ వయస్సు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ముఖ్యంగా 15,-18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇవ్వాల ప్రారంభం కానుంది. శనివారం నుంచే కొవిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకుని స్లాట్‌ పొందొచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నతరువాత వ్యాక్సినేషన్‌ ప్రాంతంలో కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు, రెండో డోసు మధ్య 28 రోజుల గ్యాప్‌ ఇస్తున్నారు. 15,-18 ఏళ్ల వయస్సు వారికి రోజుకు 3లక్షల చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుతం ఏర్పాట్లు చేసింది.

కీలకమైన కేటగిరీ వ్యక్తులకు మూడో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. చిన్నారుల వ్యాక్సినేషన్‌ కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొవాగ్జిన్‌ ఇవనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2007 లేదా అంతకంటే ముందు పుట్టిన వారంతా వ్యాక్సినేషన్‌కు అర్హులు. దేశ వ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య ఉన్నవారు సుమారు 10 కోట్ల మంది ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరీంనగర్ లో..
15 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డివిజన్ కార్పొరేటర్ సిరిమల్ల ప్రసాద్ మరియు కార్పొరేటర్ దిండిగాల మహేష్ డి ఎం హెచ్ వో జవేరియ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement