Tuesday, November 26, 2024

Life Style: హ్యాపీ మూడ్ కోసం.. పెట్స్, చిన్నారులతో ఆడుకోవడం బెస్ట్

ఏదో నిస్సహాయత.. ఎందుకో తెలియని బాధ.. చిన్నచిన్న విషయాలకే కన్నీళ్లు.. ఏం చేద్దామన్నా ఒక్కోసారి మనసొప్పదు. ఈ మూడ్ స్వింగ్స్ ఏదో ఒక టైంలో అందరికీ అనుభవమ‌య్యే ఉంటాయి. మరి ఈ ఎమోషన్స్ నుంచి బయటపడాలంటే సింపుల్ గా కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలంటున్నారు వైద్య‌ నిపుణులు. చిరాకుగా ఉన్నప్పుడు నచ్చిన సంగతులు, ఆనందంగా గడిపిన క్షణాలు యాదికి తెచ్చుకోవాలి. అలాంటి ఆలోచనల వల్ల కొత్త ఉత్సాహం వ‌చ్చి.. మనసు తేలికవుతుంది. అట్లాగే పాత ఫొటోలు చూసుకున్నా కూడా కాస్త రిలాక్స్ అవుతారు. అంతేకాకుండా పిల్లలతో ఆడి, పాడితే ఒత్తిడి అనేది క్షణాల్లో ఎగిరిపోతుంది. వాళ్ల బోసి నవ్వులు ఎంతటి కష్టంలో ఉన్నవారినైనా తమ ముఖంపై నవ్వులు పూయిస్తాయి. మనసుని ఆహ్లాదపరుస్తాయి. వీలైతే పెట్స్‌తో కూడా కాసేపు గడపొచ్చు. పచ్చని చెట్ల మధ్య కూర్చున్నా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. గులాబీ, చామంతి, మల్లె, సన్నజాజిలాంటి పూల పరిమళాలు కూడా హ్యాపీ మూడ్‌ని తీసుకొస్తాయి. మనసు బాగాలేనప్పుడు ఆ ఎమోషన్ని పేపర్‌పై పెట్టినా మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు మాన‌సిక నిపుణులు.

మనసు బాగాలేనప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నచ్చిన వాళ్లతో కాసేపు ముచ్చ‌ట్లు చెబితే చాలు, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అలాగే కొత్త కొత్త ప్లేస్‌ల‌కు వెళ్లడం.. వెరైటీ వంటకాల్ని రుచిచూడడం చేసినా మైండ్ రిలాక్స్ అవుతుంది. స్వయంగా వంట చేసినా కూడా ఆ ఒత్తిడి నుంచి ఈజీగానే బయటపడొచ్చు. ఎక్సర్సైజ్ చేస్తే ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పన్నెండు గంటల పాటు మనసుని ఉత్సాహంతో నింపుతుంది. నచ్చిన పాట పెట్టుకొని డ్యాన్స్ చేయడం… అలిసిపోయే వరకు చిందులేస్తే మూడ్ క్షణాల్లో మారిపోయే చాన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటివి ట్రై చేసి చూడండి.. మీ మూడ్‌ని రిఫ్రెష్ మోడ్‌లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement