Tuesday, November 26, 2024

Food: తినడానికి సూపర్ వార్మ్స్.. వీటిలో ప్రోటీన్ల స్థాయి ఎక్కువేనట..

కువైట్ వ్యాపారవేత్త జాసెమ్ అబ్బాస్ పశువుల‌కు మేత కోసం సూపర్ వార్మ్స్ ను ఏడాది కాలంగా పెంచుతున్నాడు. డార్కిలింగ్ బీటెల్ అనే ఈ లార్వాలను చీక‌టి గ‌దిలో మాత్రమే పెంచుతుంటారు. అయితే వీటిల్లో ఎక్కువ ప్రోటీన్లు ఉండడంతో  ఈ సూపర్ వార్మ్స్ ఇప్పుడు ప్రజల ఆహారంగా మారుతాయని ఆయ‌న అనుకుంటున్నారు. ఆ విషేషాలేమిటో తెలుసుకుందామా..

ప్రపంచవ్యాప్తంగా చాలా కీటకాలను తింటుంటారు. చైనా దేశపు ప్రజల అలవాట్లను మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం.. అదేవిధంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని ప్రజల విందు ప్లేట్లలో సుమారు 1,000 జాతుల కీటకాలు కనిపిస్తాయి. సాంప్రదాయంగా తినేవి కాకుండా క్రికెట్ పాస్తా, మీల్ వార్మ్ స్మూతీస్‌ను ప్ర‌స్తుతం ఆహారంగా తీసుకుంటున్నారు. తిన‌ద‌గిన కీటకాల ద్వారా ఎక్కువ ప్రోటీన్లు మ‌నుషుల‌కు అందుతాయ‌న్న కారణంగా వీటిని ఎక్కువ మంది లైక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సూపర్ వార్మ్స్ అంటే డార్కిలింగ్‌ బీటిల్ జాతుల లార్వా..

సూపర్ వార్మ్స్ అనేది జోఫోబాస్ మోరియో అని పిలువబడే డార్కిలింగ్‌ బీటిల్ జాతుల లార్వా. వీటిని కింగ్ వార్మ్స్, మోరియో వార్మ్స్ లేదా జోఫోబాస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా సరీసృపాల (reptile pet industry) పెంపుడు పరిశ్రమలో వీటిని ఆహారంగా ఉపయోగిస్తారు. మీల్ వార్మ్స్ అయిన‌టువంటి టెనెబ్రియో మోలిటర్ లార్వా,  సూప‌ర్ వార్మ్స్ వేర్వేరు. సూపర్ వార్మ్స్ లార్వా 50 నుండి 60 మిల్లీమీట‌ర్ల‌ పొడవున్న మీల్ వార్మ్స్ ను పోలి ఉంటుంది. వీటి శ‌రీరం చివ‌రి భాగం న‌ల్ల‌గా ఉంటుంది. వీటికి 6 చిన్న కాళ్లు ఉంటాయి. మామూలుగా కీటకాలను తాబేలు, బల్లులు, సాలమండర్లు, కప్పలు, పక్షులు మొదలైనవి తింటాయి. కాగా, ఇప్పుడివి మనుషుల ఆహారంలో భాగం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement