Tuesday, November 26, 2024

కాంస్య యుగంలో ఫుడ్ హోం డెలివ‌రీ..

పెరిగిన టెక్నాలజీ మానవ జీవనశైలిని సులభతరం చేసింది. ముఖ్యంగా ఇంటర్ నెట్ మానవ జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. షాపింగ్ చేయాలన్న, ఆకలేస్తే భోజనం చేయాలన్న ఇంటర్ నెట్ ఉంటే చాలు పావుగంటలో మన చేసిన ఆర్డర్ మనముందు ఉంటోంది. ఇంత టెక్నాలజీ వచ్చింది కదా ఇందంతా కామనే అని మనం అనుకుంటాము… అది వాస్తవమే అందరికి ఇది సాధారణ విషయమే కాని…అసలు టెక్నాలజీ అంటే ఎంలో తెలియని రోజుల్లో కూడా ఫుడ్ డెలివరీ సిస్టమ్ ఉందని ఎవరకైనా తెలుసా…అవునూ… 3 వేల ఏళ్ల క్రితమే ఫుడ్ డెలివరీ చేయడం ఉండేదట… కాంస్య యుగంలోనే ఆహారాన్ని తెప్పించుకుని తినడం ప్రారంభ‌మైంద‌ని ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

ఇప్పుడంటే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థ‌ల‌కు ఆర్డ‌ర్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే, కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం ఇటువంటి హోం డెలివ‌రీలు ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రియాలోని ఆల్ప్స్‌ ప్రాంతంలో కాంస్య యుగం నాటి ఓ రాగి గనిలో ప‌రిశోధ‌న‌లు చేశారు. ఆ గ‌నిలో రాగిని తీసేందుకు ఓ ప్రత్యేకమైన కమ్యూనిటీ ఉండేది. అక్క‌డే నివాసాలు ఏర్పాటు చేసుకుని ప‌నులు చేసుకునేది. అక్క‌డే ప‌రిశోధ‌కులు చాలా కాలంగా ప‌లు అంశాల‌పై పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో ప‌లు వ‌స్తువులు ల‌భ్య‌మ‌య్యాయి. అప్పటి వారు తిని వదలేసిన ఆహార పదార్థాల శిలాజాలు కూడా దొర‌క‌డంతో వాటిని ప‌రిశీలించారు. అయితే, ఆ ప్రాంతంలో వంట వండటానికి సంబంధించిన వస్తువులు, ఏర్పాట్ల ఆన‌వాళ్లు లేవు. అక్క‌డ ప‌నిచేసిన వారంతా ఇత‌ర ప్రాంతాల నుంచే ఆహారాన్ని తెప్పించుకుని తినేవారని తేల్చారు. వారికి వంటలు వండి తీసుకొచ్చే ప‌నులను ఇత‌ర ప్రాంతంలో ఉండే వారు చేసే వారని గుర్తించారు శాస్త్రవేత్తలు.

ఇప్పుడంటే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తినే అల‌వాటు ప్ర‌స్తుతం చాలా మందిలో పెరిగిపోయింది. కాని అప్పట్లో అసలు ఇవేమి లేకపోయిన ఆహారాన్ని తెప్పించుకు తినేవారని తెలసుకున్నాకా.. అసలు వారు కమ్యూనికేషన్ ఎలా మెయింటెన్ చేసేవారని శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement