Friday, November 22, 2024

పూల ఎగుమతిపై దృష్టి సారించాలి.. మంత్రి సింగిరెడ్డికి ట్విట్టర్‌లో కేటీఆర్‌ సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ పూల మార్కెట్‌, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. చిన్న దేశాలతో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్‌కు పూలు ఎగుమతి చేయడంలో భారత్‌ వెనుకబడిపోయిందని ట్విటర్‌ వేదికగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ చేసిన ట్వీట్‌పై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రపంచ పూల మార్కెట్‌ విలువ 900 కోట్ల డాలర్లు కాగా.. ఇథియోపియా 19.1 కోట్ల డాలర్లు, కెన్యా 59.6 కోట్ల డాలర్లు ఎగుమతి చేయగా… గత ఆర్థిక సంవత్సరంలో 7.8 కోట్ల డాలర్ల విలువైన గులాబీలను మాత్రమే భారతదేశం ఎగుమతి చేసింది. ఆఫ్రికా నుంచి యూరప్‌, కొలంబియా, ఈక్విడార్‌, అమెరికా వంటి దేశాల మార్కెట్లకు పూలు సరఫరా చేస్తోందని నాగేశ్వర్‌ పేర్కొన్నారు. కానీ, భారతదేశం మాత్రం ఎందుకు చేయలేకపోతుందంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్‌పై సందించిన కేటీఆర్‌… ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమని,తగిన ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ట్విటర్‌ వేదికగా సూచించారు.

ఖాజాగూడ లేక్‌ రోడ్డుపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు బుడ్డోడి ప్రశంసలు.
హైదరాబాద్‌లో ఓ బుడ్డోడు మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐటీ కారిడార్‌లోని ఖాజాగూడ లేక్‌ రోడ్డు హైదరాబాద్‌ నగర హైటెక్‌ను చూపిస్తోందని బుడ్డోడు శుక్రవారం ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేశాడు. మంత్రికి థాంక్యూ చెప్పాడు. వీకెండ్‌ సాయంత్రాల్లో ఈ రోడ్డుపై వాహనాలు నిషేధిస్తే పిల్లలు ఫ్రీగా వాకింగ్‌ చేసుకుంటారని తనీష్‌ కేటీఆర్‌ను అభ్యర్థించాడు. దీనికి స్పందించిన కేటీఆర్‌ హే తనీష్‌, నీ మంచి మాటలకు థ్యాంక్స్‌ అని అన్నారు. వీకెండ్‌లో ఖాజాగూడ రోడ్డుపై వాహనాల రాకపోకను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement