ఉద్యోగ నియామక పరీక్షలపై శ్రద్ధ పెట్టడంతో ఉద్యోగాలను సాధించి ప్రభుత్వ పరిపాలనలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. . ఇటీవలే రాష్ట్రంలో 80 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపు నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నింపనుందన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసిన కవిత.. అందులోనే నిరుద్యోగులకు ఈ పిలుపు ఇచ్చారు. హోలీ సంతోషంగా నిర్వహించుకోవాలని, ఆర్గానిక్ రంగులనే వినియోగించాలని ఆమె రాష్ట్ర ప్రజలను కోరారు.
పరీక్షలపై శ్రద్ధ పెట్టండి – నిరుద్యోగాన్ని పారద్రోలండి – హోలీ శుభాకాంక్షలు-ఎమ్మెల్సీ కవిత
Advertisement
తాజా వార్తలు
Advertisement