Wednesday, November 20, 2024

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని 16 మంది మృతి

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ బీభత్సంగా మారింది. ఒక‌వైపు వరదలు, మ‌రోవైపు కొండచరియలు విరిగిప‌డుతూ టూరిస్టుల ప్రాణాలు తీస్తున్నాయి. రాంఘర్ తాళ్ల ఏరియా మొత్తం నీట మునిగింది. వరదల్లో చిక్కుకున్న చాలా మంది ఇండ్ల పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ హైవే మొత్తం బ్లాక్ అయ్యిందని, కొండలపై నుంచి మట్టిపెల్లలు, రాళ్లు పడుతున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, దాదాపు 100 మందికి పైగా రెస్క్యూ చేసి కాపాడినట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుంది. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దసరా సెలవులకు ఉత్తరాఖండ్ వెళ్లారు. అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో నాలుగు రోజులుగా లేమన్ ట్రీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. తాము ఒక బిల్డింగ్ మూడో అంతస్తుపై చిక్కుపోయామని.. రెండో అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నట్లు బాధితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement