Wednesday, November 20, 2024

ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో వరదలు..72మంది మృతి..14మంది గల్లంతు

భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 72మంది మృతి చెందారు. దాదాపు 14 మంది గల్లంతయ్యారు. మరో 33 మంది గాయపడ్డారు. ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. గత మూడు రోజులుగా వరదలు దక్షిణ ప్రావిన్స్‌ను చుట్టుముట్టాయి. తొలుత చనిపోయిన వారి సంఖ్య 45 గా అధికారులు పేర్కొనగా.. నివేదికలో పొరపాటు జరిగిందని పౌర రక్షణ అధికారులు తెలిపారు. దాంతో మృతుల సంఖ్యను మళ్లీ లెక్కించారు. నేషనల్ సివిల్ డిఫెన్స్ చీఫ్ రఫెలిటో అలెజాండ్రో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మాగ్విండనావో ప్రావిన్స్‌లోని 3 నగరాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరదలు, శిథిలాల కారణంగా అత్యధిక మరణాలు నమోదయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లోకి చెత్తాచెదారం వచ్చి చేరుతుంది. బురదలో పలువురు చిక్కుకుని చనిపోయినట్లు, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement