Friday, November 22, 2024

Breaking: తెలంగాణ జిల్లాల్లో కుండపోత, హైదరాబాద్​లో భారీ వర్షం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన!

హైదరబాద్​లో ఇవ్వాల (శనివారం) సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడుతుండగా.. మరికొన్ని చోట్ల కుండపోత వాన కురుస్తున్నట్టు సమాచారం. సాయంత్రం నుంచి మొదలైన వాన రాత్రి 9.30 దాటినా వీడడం లేదు. తొలుత చిటపట చినుకులతో షురువైన వర్షం.. ఉన్నట్టుండి సౌండ్​ పెంచి భారీగా దంచికొట్టింది. జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, కూకట్​పల్లి, అమీర్​పేట్​, పంజాగుట్ట, సికింద్రాబాద్​, లకిడీకాపూల్​, దిల్​సుఖ్​నగర్​,  పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తోంది.

ఇక.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవ్వాల ఉదయం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు గోదావరి, ఇటు కృష్ణా నదిలో ఇన్​ఫ్లో పెరుగుతోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఆందోళన నెలకొంది. అయితే.. ఈ మేరకు సీఎం కేసీఆర్​ అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే కానీ, జనాలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రభావిత ఏరియాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement