Friday, November 22, 2024

Biz: ఫ్లిప్‌కార్ట్‌ ఏసీ సేల్‌, 1400 చెల్లించి కొత్త‌ ఏసీని ఇంటికి తెచ్చుకోండిలా!

ఈసారి ఎండలు భ‌గ్గున మంట‌పుట్టిస్తున్నాయి. కూలర్లు కూడా ఈ ఎండ‌ల‌ను తట్టుకోలేకపోతున్నాయి. ఇట్లాంటి సిచ్యుయేష‌న్‌లో ఎయిర్ కండీషనర్ ఉండాల్సిందే అంటున్నారు చాలామంది. కానీ. ఏసీ కొనాలంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుంచి దిగువ‌న ఉన్న ప్ర‌జ‌ల‌కు చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. దీంతో చాలామంది వీటిని కొనుగోలు చేయలేరు. కానీ, తక్కువ ఖర్చుతో ఏసీని ఇంటికి తీసుకొచ్చే ఐడియా ఒకటి ఉందంటోంది ఫ్లిప్‌కార్ట్‌. EMI ద్వారా అత్యంత ఖరీదైన ACని ఇంటికి తీసుకొచ్చే చాన్స్ ఉంది. ప్రతి నెలా రూ.1400 చెల్లించి ఏసీని సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో చ‌దివి తెలుసుకుందాం. కొన్ని ఏసీలు ఎక్కువ కరెంటు వినియోగిస్తాయి. కానీ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు కొంటే కరెంటు బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. తక్కువ EMIతో ఇంటికి తెచ్చుకునే విండో ACల గురించి తెలుసుకుందా..

బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ విండో AC:
బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ విండో AC చాలా ప్రజాదరణ పొందింది. ఈ AC టర్బో కూలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది గదిని వేగంగా చల్లబరుస్తుంది. డస్ట్ ఫిల్టర్ దుమ్మును సమర్థవంతంగా తొలగిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.40,500, అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కి అందుబాటులో ఉంది. 1,197 చెల్లించి EMI ద్వారా ఇంటికి తీసుకురావచ్చు. 36నెలల పాటు, మీరు ప్రతి నెలా రూ.1,197 చెల్లించాల్సి ఉంటుంది.

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ విండో ఇన్వర్టర్ AC:
వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ విండో ఇన్వర్టర్ ఏసీకి ఎక్కువ డిమాండ్ ఉంది. దీని పరిమాణం చాలా చిన్నది కానీ గొప్ప గాలిని ఇస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఇది సెల్ఫ్‌ డిటర్మినేషన్‌ (Self-determination) ఫీచర్‌తో వస్తుంది. దీని BLDC కంప్రెసర్ మెరుగైన పనితీరును అందించే శక్తిని కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ. 40,990, అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కి అందుబాటులో ఉంది. రూ.1,197 చెల్లించి ఇంటికి తెచ్చుకోవచ్చు. 36 నెలల పాటు మీరు ప్రతి నెలా రూ.1,197 చెల్లించాలి.

LG కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ 1 టన్ 5 స్టార్ విండో AC:
LG కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ 1 టన్ను 5 స్టార్ విండో AC డ్యూయల్ ఫిల్టర్‌తో వస్తుంది. దీని డిజైన్ కూడా మిగిలిన ఏసీల కంటే భిన్నంగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 56,990. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,990కి అందుబాటులో ఉంది. 3,555 చెల్లించి EMI ద్వారా ఇంటికి తీసుకురావచ్చు. 9 నెలల పాటు మీరు ప్రతి నెలా రూ.1,197 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement