ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రం బాంబు దాడులు చేస్తోందని, అందుకని అక్కడ విమాన సేవలన్నీ నిలిచిపోయాయని, ఆ దేశం ఎయిర్ స్పేస్‌ని ఓపెన్ చేసిన తర్వాత తిరిగి విమాన సేవలను పునఃప్రారంభిస్తామని భారత్ తెలిపింది. ‘‘ఉక్రెయిన్‌కు ఇంతకుముందు విమానాలు వెళ్లాయి. ఈ రోజు కూడా అక్కడి నుంచి కొంతమందిని భారత్‌కు తీసుకొచ్చాం. కానీ, 3 గంటల తర్వాత పరిస్థితులు మారాయి. అక్కడికి పంపిన విమానాలు తిరిగి వచ్చాయి. ఉక్రెయిన్‌లో విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితులు లేవు.. అక్కడి ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయగానే మళ్లీ విమానాలను నడుపుతాము” అని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో యుద్ధ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులతో సహా దాదాపు 18,000 మంది భారతీయులను వెనక్కి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం హామీ ఇచ్చింది.
డోంట్ వర్రీ.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న అందరినీ తీసుకొస్తాం: జ్యోతిరాదిత్య సింధియా
Advertisement
తాజా వార్తలు
Advertisement