Tuesday, November 26, 2024

Rain Alert: భారీ వర్షాల ప్రభావం.. పలు విమానాల దారి మళ్లింపు, షెడ్యూల్​ చేంజ్​!

కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో భారీ మార్పులతో ల్యాండింగ్​కు రెడీగా ఉన్న పలు విమానాలను దారి మళ్లించినట్టు విమానయాన సంస్థ తెలిపింది. శుక్రవారం గోవా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన అనేక విమానాలు ప్రతికూల వాతావరణం, విజిబులిటీ సరిగ్గా లేని కారణంగా దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుండి గోవాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 146 ప్రతికూల వాతావరణం కారణంగా బెంగళూరుకు మళ్లించారు. ఈరోజు తెల్లవారుజామున 3:20 గంటలకు విమానం గోవా చేరుకోవాల్సి ఉంది. ఇక.. గోవా-లండన్ విమానం బయలుదేరడం కూడా రేపటికి (శనివారం) వాయిదా పడింది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా గోవా విమానాశ్రయం నుండి ల్యాండ్ లేదా టేకాఫ్ కావాల్సిన అనేక ఇతర విమానాల షెడ్యూల్లోనూ మార్పులు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

భారత వాతావరణ విభాగం (IMD) గోవాలో రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలుంటాయని తెలిపింది. జులై 10వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇవ్వాల గోవాలో అత్యంత భారీ వర్షపాతం నమోదు కాగా, జూలై 9 మరియు 10 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement