మంచుతో శ్రీనగర్ ఏరియా వణికిపోతోంది. కనుచూపు మేరలో ఏమున్నదో కనిపించని పరిస్థితులు తలెత్తాయి. దీంతో నిన్న నడవాల్సిన 40 విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు. కాగా, భారీ మంచు కారణంగా రద్దు చేసిన అన్ని విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించామని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇండియా అధికారులు తెలిపారు. ఆదివారం దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య శ్రీనగర్ కు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయన్నారు.
భారీ హిమపాతం, సమీప దూరంలో ఏమున్నది కనిపించని కారణంగా శ్రీనగర్ విమానాశ్రయం నుండి శనివారం నడపాల్సిన 40 విమానాలు రద్దు చేశారు.. “షెడ్యూల్ ప్రకారం విమానాలు రావడంతో ఆదివారం ఉదయం శ్రీనగర్ విమానాశ్రయానికి బయలుదేరే విమాన ట్రాఫిక్ పునరుద్ధరించబడింది” అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా జనవరి 4 నుండి దాదాపు 270 విమానాలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విమానాల రద్దు కారణంగా ఏర్పడిన బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేయడానికి కొన్ని విమానయాన సంస్థలు శ్రీనగర్ సెక్టార్‌కి తాజా బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసాయి.