Tuesday, November 26, 2024

ఫ్లైట్ లో ప్ర‌థ‌మ చికిత్స‌..అందించింది ఎవ‌రో తెలుసా..

ప్ర‌యాణాల్లో ఒక్కొసారి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతుంటాయి..నేల‌పై అయితే ఓకే గాల్లో ప్ర‌యాణం అయితే ఇక అంతే స‌డెన్ గా ఫ్లైట్ ని దించ‌లేరు. అలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంది.ఇండిగో విమానం ఢిల్లీ నుంచి ముంబ‌యికి బ‌య‌లుదేరింది. టేకాఫ్ అయినాక ఒక గంట తర్వాత ఓ ప్రయాణికుడు ఆరోగ్య సమస్యతో తల్లడిల్లాడు. ఉన్నట్టుండి తల తిప్పినట్టు అవుతున్నదని, తీవ్ర నీరసం ఆవహించిందని చెప్పాడు. ప్రథమ చికిత్స కిట్ ఉన్నది.. కానీ.. వైద్యులెవరైనా ఉంటే బాగుండు అని ఫ్లైట్ సిబ్బందికి అనిపించింది. తోటి ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని అడిగారు. ఈ ప్రకటన వినీ వినగానే యూనియ‌న్ మినిస్టర్ డాక్టర్ భాగవత్ కిషన్‌రావు కరద్ ఆ పేషెంట్ దగ్గరకు పరుగున వెళ్లి ప్రథమ చికిత్స అందించారు.

అంతేకాదు, ఎమర్జెన్సీ కిట్‌లోని ఓ ఇంజెక్షన్ ని చేశారు. ఈ ట్రీట్‌మెంట్ తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత మెరుగైంది.. అనంతరం ఆ పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.ఇండిగో కూడా కేంద్ర మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికుడు అమిత్ చవాన్ ఈ ఘటనపై ట్వీట్ చేశాడు. గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కిషన్‌రావు కరద్ వృత్తిరీత్యా వైద్యుడు. ఇండిగో విమానం ఎక్కిన తర్వాత ఓ ప్రయాణికుడు అనారోగ్యానికి గురవ్వడంతో ప్రథమ చికిత్స అందించి సహకరించారు. తోటి ప్రయాణికులు కేంద్ర మంత్రిపై ప్రశంసలు కురిపించారు’ అని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement