Thursday, November 21, 2024

Air India | ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు.. రన్​వేపైకి చేరుతుండగా పేలిపోయిన టైరు

ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్​ ఇండియా విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్యాసెంజర్స్​ అంతా ప్లేన్​లోకి ఎక్కేశారు. ఇక స్టాండింగ్​ ప్లేస్​ నుంచి టేకాప్​ కావాల్సి ఉండగా.. పైలట్​కి ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో మరోసారి చెక్​ చేసుకోగా విమానం టైర్​ దెబ్బతిని ఉంది. దీంతో వెంటనే ప్రయాణికులను మరో ఎయిర్​ ప్లేన్​లోకి మార్చి.. దాన్ని రిపేర్​కు తరలించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఖాట్మండ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి న్యూ ఢిల్లీకి 173 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌కు ముందు ఆగిపోయింది. అనుకోకుండా టైర్ పగిలిపోవడంతో విమానాన్ని ఆపవలసి వచ్చిందని ఎయిర్​పోర్ట్​ అథారిటీ అధికారి తెలిపారు. ఈ విమానం ఇవ్వాల సాయంత్రం 4:30 గంటలకు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) నుండి న్యూఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది.

ఇక.. ఎయిర్ ఇండియాలోని డ్యూటీ ఆఫీసర్ AI 216 విమానం టేకాఫ్ అయ్యే ముందు టైర్ పగిలిపోయినట్టు ధ్రువీకరించారు. విమానంలో 164 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారని అధికారి తెలిపారు. ఎయిర్‌బస్ 320 ఎయిర్‌క్రాఫ్ట్ ను రన్‌వే నుండి పార్కింగ్ ప్రాంతానికి తరలించినట్టు ఆయన చెప్పారు.

అవసరమైన నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం రేపు (శనివారం) రీషెడ్యూల్ చేస్తామని ఎయిర్​పోర్ట్​ అథారిటీ అధికారి తెలిపారు. ఓ పత్రికా కథనం ప్రకారం మాత్రం.. విమానం టాక్సీవే నుండి థ్రెషోల్డ్ ప్రాంతానికి చేరుకుందని, టైర్ పగిలిపోయినా టేకాఫ్ కావడానికి రెడీగా ఉందని రాసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement