నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ వరదల్లో పలువురు భక్తులు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, 50 మందిని రక్షించామని జిల్లా మేజిస్ట్రేట్ మౌమిత గోదరా తెలిపారు. వారిలో గాయపడిన 13 మందిని దవాఖానలో చేర్చామని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. గల్లంతైనవారికోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు, స్థానిక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టాయని తెలిపారు. భారీవర్షాల వల్ల మాల్ నదిలో మెరుపు వరదలు వచ్చి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి-ఉప్పొంగిన వరద-ఎనిమితి మృతదేహాలు వెలికితీత
Advertisement
తాజా వార్తలు
Advertisement