దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో 2022లో జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు సమాచారం. దీనిపై ఎలక్షన్ కమిషన్ త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటించున్నట్టు తెలుస్తోంది.
కాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్టాల అసెంబ్లీలకు 2002లో ఎన్నికలు జరుగుతాయాన్న అంచనాలతో ఇప్పటికే పలు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ కేడర్‌ని బలోపేతం చేసుకునేలా పలు రకాల ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే.. ఎన్నికలు వాయిదా పడుతాయన్న వార్తలతో చాలామంది లీడర్లు నిరాశకు గురవుతున్నారు.