Tuesday, November 19, 2024

పెరూలో నిర‌స‌న జ్వాల‌లు.. అగ్నికి ఆహుత‌యిన ప్ర‌పంచ వార‌స‌త్వ భ‌వ‌నం

పెరూలో నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగాయి. పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కాగా, పెరూ రాజధాని లిమాలో ఉన్న ప్రపంచ వారసత్వ భవనం ఆందోళనాకారుల ఆగ్రహజ్వాలలకు చిక్కి బూడిదైంది. మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పెరూలో జాతీయ సమ్మె తీవ్ర ఆందోళనకు దారితీసింది. లిమాలోని వరల్డ్‌ హెరిటేజ్‌ బిల్డంగ్‌గా నమోదైన శాన్‌ మార్టిన్‌ ప్లాజా సమీపంలో పెద్ద సంఖ్యలో ఆందోళనాకారులు గుమిగూడారు.

వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు-ఆందోళనాకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న శాన్‌ మార్టిన్‌ భవనంలో మంటలు చెలరేగాయి. క్రమంగా భవనం అంతా విస్తరించి కార్చిచ్చులా మారింది. ఈ భవనం దాదాపు 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఆందోళనాకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు ప్రయోగించిన టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. పెరూలో మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లా మద్దతుదారులు – భద్రతా దళాలకు మధ్య కొన్ని నెలలుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తున్నది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు సమాచారం. వీరిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు మూడేండ్లుగా రాజకీయ టెన్షన్‌ కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement