Tuesday, November 26, 2024

సుప్రీం కోర్టు జడ్జీలుగా మరో ఐదుగురు .. 32కి పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య‌

సుప్రీంకోర్టులో కొత్త‌గా ఐదుగురు జ‌డ్జీలు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.దాంతో సుప్రీం న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 32కు చేరింది. సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌తో పాటూ జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవీబాధ్యతలు స్వీకరించారు. సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం..గతేడాది డిసెంబర్ 13న ఈ ఐదుగురి పేర్లను కేంద్రానికి సిఫారుసు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనల విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. చివరకు కేంద్రం కొలీజియం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో తెలుగు వ్యక్తి పమిడిఘంటం శ్రీనరసింహం న్యాయమూర్తిగా ఉన్నారు. తాజాగా జస్టిస్ పులిగోరు వెంటట్ సంజయ్ కుమార్‌ నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో తెలుగు జడ్జీల సంఖ్య రెండుకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement