Friday, November 22, 2024

హోలీ రోజు వింత ఆచారం.. ఆ గ్రామంలో ఏం చేస్తారో తెలుసా?

హోలీ పండుగ అంటే అందరూ సరదాగా రంగులు పూసుకుని జరుపుకుంటారు. కానీ తెలంగాణ లోని ఒక గ్రామంలో హోలీ పండుగ రోజు ఇష్టమొచ్చినట్టుగా పిడిగుద్దులతో కొట్టుకుంటారు. అలా పిడిగుద్దులాట ఆడకుంటే తమకు ఎంతో నష్టం జరిగిపోతుందట. ఈ వింత ఆచారాన్ని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని ఓ గ్రామంలో పాటిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హున్స అనే గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో వారు పిడిగుద్దుల ఆటకు రెడీ అయిపోతారు. నిజామాబాద్ జిల్లాలోని హున్సా గ్రామంలోని సంప్రదాయ ఆట పిడిగుద్దులాట. రంగుల పండుగ హోలీ సందర్భంగా హున్సా గ్రామస్థులు తమ గ్రామం శ్రేయస్సు, సంక్షేమం కోసం ఈ ఆట ఆడతారు. ఒకవేళ హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట లేకుంటేఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా జరిగితే దానికి పిడిగుద్దులాట ఆడకపోవటమే కారణం అని వారంతా బాధపడిపోతుంటారు. అందుకే ప్రతీ ఏటా ఆ గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగాకుండా హోలీ సంబరాల్లో భాగంగా పిడిగుద్దులాట ఆడతారు. ఒకరినొకరు కొట్టుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట ఆడటాన్ని ఈ గ్రామస్థులు పాటిస్తున్నారు. పిడిగుద్దులాట ఆడిన తరువాత గ్రామస్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే, పిడిగుద్దులాట ఆడే సమయంలో కొన్న సార్లు గాయలపాలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement