Friday, November 22, 2024

చేప‌ల లారీ బోల్తా, క్ష‌ణాల్లో మాయ‌మైన చేప‌లు.. మృగ‌శిర కార్తెకు ముందే జ‌నాల‌కు పండుగ‌!

మృగశిర కార్తె అనగానే తెలుగువారికి గుర్తుకు వచ్చేది ప్ర‌ధానంగా చేపలే. మృగళిర కార్తె రోజున చేపలు తింటే హెల్త్‌కి మంచిదని పెద్ద‌లు చెబుతుంటారు. అందుకే మృగశిర కార్తె రోజు చేపల కోసం జనాలు ఎగబడుతారు. ఆ రోజు ఏ ఫిష్ మార్కెట్ చూసినా విపరీతమైన రద్దీ ఉంటుంది. మృగశిర కార్తె రాగానే వెదర్ కంప్లీట్‌గా మారిపోతుంది. వేసవి తాపం నుంచి జనాలకు ఉపశమనం ల‌భిస్తుంది. వెదర్ కూల్ కావడంతో బాడీలో టెంపరేచర్ తగ్గిపోతుంది. దీంతో శరీరంలో హీట్ పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారని టాక్. చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు కాస్త బెట‌ర్‌మెంట్ ఉంటుందని డాక్ట‌ర్లు కూడా చెబుతుంటారు. ఇక‌.. మృగశిర కార్తె ఎంట్రీకి రెండు, మూడు రోజుల ముందే జనాలు చేపల కోసం వేట షురూ చేస్తుంటారు. చేపలు ఎక్కడ దొరుకుతాయో ఆరా తీస్తుంటారు. అట్లాంటిది ఆ ఊరి జనానికి మాత్రం అనుకోని వరం తగిలింది. చేపలే వాళ్ల దగ్గరకి వచ్చి పడ్డాయి. ఇంకేం ఆ చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. అందినకాడికి తీసుకుని వెళ్లారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఈ ఘటన జ‌రిగింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బూర్గంపాడులోని భద్రచాలం క్రాస్ రోడ్డు దగ్గర అదుపుతప్పి బోల్తా పడిపోయింది. దీంతో లారీ ఫల్టీ కొట్టడంతో అందులోని చేప‌ల‌న్నీ రోడ్డుపై పడిపోయాయి. లారీ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడి క్యూకట్టారు. రోడ్జుపై పడి ఉన్న చేపలను తీసుకెళ్లారు. బూర్గంపాడుతో పాటు సమీప గ్రామాల ప్రజలు నిమిషాల్లోనే చేపల లారీ దగ్గరకు చేరుకున్నారు. అందినకాడికి చేపలను తీసుకెళ్లారు. తెల్లారే మృగ‌శిర కార్తె కావడంతో జనాలు చేప‌ల కోసం ఎగబడ్డారు.

పిల్లలతో పాటు వృద్ధులు కూడా చేపలు తీసుకెళ్ల‌డంలో పోటీ పడ్డారు. దీంతో లారీలో ఉన్న దాదాపు 4 వేల చేపలు కేవలం అరగంటలోనే ఖాళీ అయ్యాయి. కొందరైతే బస్తాల కొద్ది పట్టుకుపోయారు. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. ఏపీ నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రంలోని నాగపూర్ కు చేప‌ల లోడుతో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement