ఢిల్లీలో వరుసగా ఐదురోజుల నుండి పొగమంచు దట్టంగా కురుస్తోంది.కాగా గత పదేళ్లలో ఇదే తొలిసారి. 2013లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నా అప్పట్లో ఐదు రోజులకు మాత్రమే పరిమితమైంది. ఈసారి మాత్రం చలి వాతావరణం రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, దట్టమైన మంచు కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే, నేటి రాత్రి నుంచి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు దాదాపు 20 గంటలపాటు ఏకధాటిగా మంచు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ కనుచూపు మాత్రం 1000 మీటర్లకే పరిమితమైంది. అయితే, సాయంత్రం తర్వాత మళ్లీ పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ 600 మీటర్లకు పడిపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement