Friday, November 22, 2024

దేశంలోనే తొలిసారిగా కరోనా నుంచి కోలుకున్న 110 ఏళ్ల వృద్ధుడు

హైదరాబాద్ నగరంలో ఓ శతాధిక వృద్ధుడు కరోనా నుంచి కోలుకుని ఔరా అనిపించారు. కీసరగుట్టకు చెందిన 110 ఏళ్ల రామానంద తీర్థ ఇటీవల కరోనా బారిన పడటంతో ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన వివరాలను కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. ఆశ్రమ నిర్వాహకుల వద్ద కూడా ఆయనకు సంబంధించిన వివరాలు లేవు.

అయితే 18 రోజుల చికిత్స అనంతరం రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు తెలిపారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించనున్నట్టు చెప్పారు. 110 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకోవడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు బెంగళూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్ఎస్ దొరస్వామి (104) కూడా కరోనా బారినపడి కోలుకున్నారు. చికిత్స సమయంలో ఆయన ఆత్మవిశ్వాసంతో కనిపించారని, అందుకే ఔషధాలు పనిచేశాయని వైద్యులు వివరించారు. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement