Monday, November 25, 2024

తొలి జ‌లాంత‌ర్గామి ఐఎన్ ఎస్ క‌ల్వ‌రి గురించి మీకు తెలుసా ..

తొలి జ‌లాంత‌ర్గామి ఐఎన్ ఎస్ క‌ల్వ‌రి భార‌త‌దేశం నౌకాద‌ళంతో స‌రిగ్గా ఇదే రోజున 1967లో వ‌చ్చి చేరింది. ఆ త‌ర్వాత ఏడాది వైజాగ్ చేరుకుంది ఐఎన్ ఎస్ క‌ల్వ‌రి. అప్ప‌టి సోవియ‌ట్ యూనియ‌న్ నుంచి ఇండియాకి వ‌చ్చింది క‌ల్వ‌రి. ఐఎన్ ఎస్ క‌ల్వ‌రి సేవ‌ల‌కు గుర్తుగా 2017లో భార‌త ప్ర‌భుత్వం రూ.500విలువ చేసే పోస్ట‌ల్ స్టాంప్ ల‌ను తెచ్చింది. కాగా 24ఏళ్ల‌పాటు విశేష సేవ‌ల‌ను అందించింది క‌ల్వ‌రి. 1971లో పాకిస్థాన్ లో జరిగిన యుద్ధంలో కరాచీ ఓడరేవుతో పాటు అక్కడి నౌకలను బూడిద చేయడంలో క‌ల్వ‌రి ప్రధాన పాత్ర పోషించింది.

కాగా ఈ జ‌లంత‌ర్గామి పొడ‌వు 91 మీటర్లు. సముద్రం నీటి అడుగున గంటకు 28 కిలోమీట‌ర్ల చొప్పున ప్రయాణించడం దీని ప్రత్యేకత. భారత నౌకాదళంలో చేరిన నాలుగు సంవత్సరాల తర్వాత.. ఈ జలాంతర్గామి 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో తన శక్తి ఏపాటిదో ప్ర‌పంచానికి చూపించింది. ఈ యుద్ధంలో కరాచీ ఓడరేవును వరుస బాంబులు వేసి ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించింది. దాదాపు 30 సంవ‌త్స‌రాలు దేశానికి సేవలందించిన తర్వాత 1996 మార్చి 31న నౌకాదళం నుంచి రిటైర్ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement