Saturday, November 23, 2024

Solar Eclipse: నేడు మొదటి సూర్య గ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా ?

ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం  ఇవాళ ఏర్పడబోతోంది. ఈసారి సూర్యగ్రహణం అమావాస్య నాడు రావడం యాదృచ్ఛికం. సూర్యగ్రహణం అంటే చాలా మందికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. సూర్య గ్రహణం ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడ కనిపిస్తుంది? సూతక కాలం ఎప్పుడు ఉంటుంది? లాంటివి. భార‌త‌ కాల‌మానం ప్ర‌కారం..  ఇవాళ రాత్రి 12.15 నిమిషాల‌కు సూర్య గ్ర‌హ‌ణం ప‌ట్ట‌నున్న‌ది. అంటార్కిటికా, ద‌క్షిణ అమెరికా, ప‌సిఫిక్‌, అట్లాంటిక్ స‌ముద్ర తీరాల్లో ఈ గ్ర‌హణాన్ని వీక్షించ‌వ‌చ్చు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, ప‌రాగ్వే, బొలివియా, పెరూ, బ్రెజిల్ దేశాల్లో గ్ర‌హ‌ణాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌వ‌చ్చు. బ్యూన‌స్ ఏరిస్‌, ఫాల్క్‌లాండ్‌, మ‌చు పిచు బేస్‌, మాంటివిడో, శాంటియాగో ప‌ట్ట‌ణాల నుంచి సూర్య గ్ర‌హ‌ణాన్ని వీక్షించ‌వ‌చ్చు అని నాసా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ ఏడాది రెండు పాక్షిక సూర్య గ్ర‌హ‌ణాలు ఉన్నాయి. దాంట్లో ఇవాళ్టిది మొద‌టిది. రెండ‌వ‌ది ఈ ఏడాది అక్టోబ‌ర్ 25వ తేదీన క‌నిపించ‌నున్న‌ది. అయితే ఇవాళ రాత్రి జ‌రిగే సూర్య గ్ర‌హ‌ణం ఇండియాలో క‌నిపించ‌దు. 

సూర్యుడు- భూమికి మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు, భూమిపై దాని నీడ పడుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకున్నప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. నాసా ప్రకారం… ఇవాళ సంభవించే గ్రహణం ద్వారా 65% సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement