Friday, November 22, 2024

ఫ‌స్ట్ మెసేజ్ వేలం పాట : రూ. కోటిన్న‌ర వ‌స్తుంద‌ని అంచ‌నా

అదృష్టం త‌లుపుత‌ట్టాలే కానీ రాత్రికి రాత్రే ల‌క్ష‌ధికారి లేదా కోటీశ్వ‌రుల‌యిపోవ‌చ్చు. ల‌క్ష్మీదేవి క‌టాక్షం అంటారు దీన్నే పెద్ద‌లు. ఇప్పుడ‌దే జ‌రిగింది. వివ‌రాలు ఏంటో చూద్దాం. 30ఏళ్ళ నాటి మెసేజ్ ని ఇప్పుడు వేలం వేశారు. 30సంవ‌త్స‌రాల క్రితం డిసెంబ‌ర్3న నీల్ పాప్ వ‌ర్త్ అనే ఇంజ‌నీర్, రిచ‌ర్డ్ జార్విస్ అనే వ్య‌క్తి హ్యాండ్ సెట్ ఆర్బిటెల్ 901కి ఓ మెసేస్ పంపాడు. ఆ మెసేజ్ ఏంటంటే మేరీ క్రిస్మ‌స్ అని. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ప్ర‌పంచ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌లో మొద‌టి మెసేజ్ ఇది. ఈ మొద‌టి ఎస్ఎంఎస్‌ని వొడాఫోన్ ఐడియా ఇప్పుడు వేలానికి తీసుకొచ్చింది. మేరీ క్రిస్మస్ అంటూ మెసేజ్ పంపించిన నీల్ పాప్‌వర్త్ ఎవరంటే వొడాఫోన్ ఎస్ఎంఎస్ సర్వీసు కోసం పనిచేస్తోన్న టెస్ట్ ఇంజనీర్. మేరీ క్రిస్మస్ అనే మెసేజ్‌తో ఎస్ఎంఎస్ వర్క్ అవుతుందో లేదోన‌ని ఆ ఇంజనీర్ టెస్ట్ చేశారు.

ఈ మెసేజే ప్రపంచ కమ్యూనికేషన్ స్వరూపాన్ని మార్చేసింది. ఆ తర్వాత నోకియా తన మొబైల్ ఫోన్లలో మెసేజింగ్ సర్వీసులను ప్రవేశపెట్టి, ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు ఒక రూపం తెచ్చిన సంగ‌తి తెలిసిందే. నాన్-ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్‌టీ)గా ఈ ఎస్ఎంఎస్‌ను వేలం వేస్తున్నారు. ఈ వేలంలో సేకరించిన డబ్బును ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్‌కి విరాళంగా ఇస్తున్నారు. ఈ ఎన్‌ఎఫ్‌టీ వేలానికి 2 లక్షల డాలర్లు అంటే కోటిన్నరకు పైగా డబ్బులు వస్తాయని వొడాఫోన్ అంచనావేస్తోంది. కాగా ఈ వేలం పాట పారిస్ లో జ‌రుగుతుంది, ఆక్షన్ హౌస్ అగుట్స్ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. ఫ్రాన్స్‌లో తొలి ఇండిపెండెంట్ ఆక్షన్ హౌస్ ఇదే. ఆన్‌లైన్‌గా కూడా ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఈ ఎస్ఎంఎస్‌ను కొనుగోలు చేసే వారికి వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్ సంతకంతో కూడిన గ్యారెంటీ సర్టిఫికేట్‌తో పాటు ఒరిజినల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌కు సంబంధించిన వివరణాత్మక ప్రతిరూపాన్ని వారికి అందజేస్తారు. అదనంగా ఈ మెసేజ్ సెంట్, రిసిప్ట్ డాక్యుమెంట్లను, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కాపీని అందజేస్తారు. మ‌రి ఈ వేలం ఎంత‌కి వెళ్లుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement