ఉత్తరకొరియాలో గురువారం తొలి కోవిడ్ కేసు నమోదయింది. దాంతో భయపడిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మొట్ట మొదటిసారి మాస్క్ తో కనిపించారు. కిమ్ జాంగ్ కూడా కరోనాకు భయపడ్డాడని సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయి. ఉత్తర కొరియా దేశంలో ఒక్క కొవిడ్ కేసు నమోదు కాలేందని ఇన్ని రోజులు ఉత్తర కొరియా ప్రభుత్వం తెలిపింది. కాగా కోవిడ్ తొలి కేసు నమోదైన అనంతరం దేశంలోని ప్రభుత్వ నేతలు అధికారులతో కిమ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కిమ్ జాంగ్ మాస్క్ ధరించి రావడం విశేషంగా మారింది. దీంతో కిమ్ కూడా కరోనాకు భయపడిపోతున్నాడని అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి కోవిడ్ కేసు ఉత్తరకొరియాలో నమోదు కావడంతో పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కార్యాలయాల మధ్య అనుసంధానాన్ని మూసేశారు. దేశంలో చాలా మందికి టీకాలు కూడా వేయలేదు. దీంతో కోవిడ్ వ్యాప్తిపై అనేక భయాలు వెంటాడుతున్నాయి. దీనిని గమనించిన కిమ్ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. మొదటి కేసు బయటపడడంతో ఉత్తరకొరియా హడావుడి మొదలుపెట్టింది. రాజధాని ప్యాంగ్యాంగ్ లో జ్వరాలతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కొరియన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ మాస్క్ ధరించి కనిపించడం వైరల్ గా మారింది.
మొదటిసారి మాస్క్ ధరించిన – ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
Advertisement
తాజా వార్తలు
Advertisement