తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్‌లో 1990లో సినిమా టాకీస్‌లు మూతపడ్డాయి. మూడేండ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సరిహద్దులతోపాటు అంతర్గతంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలు గతంలో కంటే తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వినోద సాధనమైన థియేటర్లను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో కొన్ని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు యువతకు సినిమా మాధ్యమాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ఇప్పుడు శ్రీనగర్‌లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ సెప్టెంబర్ నెలలో ఓపెన్‌కానుంది. ఐనాక్స్ సంస్థ ఆ థియేటర్‌ను సిద్ధం చేస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement