Tuesday, November 19, 2024

క్యాన్స‌ర్ కి – వ్యాక్సీనియా వైర‌స్ ఇంజెక్ష‌న్ తో చెక్

ఇంజెక్ష‌న్ ద్వారా క్యాన్స‌ర్ ని అంతం చేయొచ్చ‌ట‌. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెరతీశారు. కేన్సర్ ను అంతం చేసే వైరస్ ను ఇంజెక్షన్ ద్వారా కేన్సర్ రోగిలోకి ప్రవేశపెట్టారు. వ్యాక్సీనియా అనే ఈ వైరస్ ను అమెరికాలో ఓ సంస్థ అభివృద్ధి చేసింది. జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడగా విజయం సాధించారు. ఈ వైరస్ కొలన్, లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, పాంక్రియాటిక్ కేన్సర్ ట్యూమర్లను తగ్గిస్తున్నట్టు ప్రీ క్లినికల్ లేబరేటరీ, జంతువులపై పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికాలో అతిపెద్ద కేన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థ ‘సిటీ ఆఫ్ హోప్’ ప్రకటించింది. “మా గత పరిశోధనలో.. ఆంకోలైటిక్ వైరస్ లు కేన్సర్ ను అంతం చేసేందుకు వీలుగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నట్టు గుర్తించడం జరిగింది’’ అని సిటీ ఆఫ్ హోప్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డానెంగ్ లీ తెలిపారు. కేన్సర్ తో పోరాటం చేస్తున్న వారికి వ్యాక్సీనియా మంచి ఫలితం ఇస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా వ్యాక్సీనియా ఇంజెక్షన్ ను తక్కువ మోతాదులో నేరుగా కేన్సర్ ట్యూమర్లుకు లేదా నరాలకు ఇవ్వనున్నట్టు సిటీ ఆఫ్ హోప్ తెలిపింది. వ్యాక్సీనియా అని పిలిచే దీనికి సీఎఫ్ 33- హెచ్ఎన్ఐఎస్ అని కూడా పేరు. ఇది ఆంకోలైటిక్ వైరస్. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాలు ఉంటాయి. కేన్సర్ కణాలను గుర్తించి అంతం చేసే విధంగా జన్యుపరంగా మార్పు చేసిన వైరస్ ఇది. ఇది అందుబాటులోకి వ‌స్తే క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిని ఈజీగా పార‌ద్రోల‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement