Saturday, November 23, 2024

భార‌త్ లో తొలి ఎల‌క్ట్రిక్ టిప్ప‌ర్.. రూపొందించిన మేఘా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ ట్ర‌క్ ను ఆవిష్‌క‌రించింది తెలుగు రాష్ట్రాల‌కి చెందిన మేఘా ఇంజ‌నీరింగ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్స్ కు చెందిన ఎల‌క్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేలా దీన్ని రూపొందించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌–2023లో ప్రదర్శనకు ఉంచిన ఈ వాహనం అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు గంటల్లోనే బ్యాటరీ వంద శాతం చార్జ్ అవుతుంది. ఈ–ట్రక్‌ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్‌లో ట్రయల్స్‌ ప్రారంభించింది. ట్రయల్స్ విజయవంతం కావడంతో ట్రక్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టేందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సిద్ధం అవుతోంది. వచ్చే నెలలో ఈ ఎలక్ట్రిక్ టిప్పర్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ మ‌ధ్య‌కాలంలో ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది..అందుకే ఈ టిప్ప‌ర్ ని తాము రూపొందించామ‌ని గ్రీన్ టెక్ సంస్థ వెల్ల‌డించింది. ఈ వాహ‌నం ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement