ములుగు జిల్లా మండల కేంద్రంలో 39వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ సమావేశం జరిగింది. కాగా బెటాలియన్ లోని స్టీఫెన్, ఎస్సై ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జవాన్ మధ్య ఘర్షణ జరిగింది. దాంతో రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎస్సై ఉమేష్ చంద్ర ఘటనాస్థలంలో మరణించాడు. కానిస్టేబుల్ స్టీఫెన్ కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో స్టీఫెన్ ను ఏటూరు నాగారం ఏరియా హస్పటల్ కి తరలించారు. ఉమేష్ చంద్ర సొంతూరు బీహార్ కాగా… స్టీఫెన్ ది కన్యాకుమారి అని సమాచారం. విధి నిర్వహణలో ఏర్పడ్డ భేదాభిప్రాయాలతో సి ఆర్ పి ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయి బెటాలియన్ ఎసై పై కాల్పులు జరిపి,తాను కాల్పులు జరుపుకున్న ఘటన ములుగు జిల్లా అడవి వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈ ఘటనలో ఎసై అక్కడికక్కడే మరణించాడు.
కాగా తనకు తానే కాల్చుకొన్న హెడ్ కానిస్టేబులు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఈ మేరకు ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సి ఆర్ పి ఎఫ్ 39 బెటాలియన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ సిఆర్పిఎఫ్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్ర పై కాల్పులు జరిపారు.అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. ఈ సంఘటనలో ఎస్సై ఉమేష్ చంద్ర మృతిచెందగా, హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై తదుపరి విచారణ చేసి పూర్తి వివరాలు తెలుపుతామని ములుగు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంగ్రామ్ సింగ్ పాటిల్ పేర్కొన్నారు. పని ఒత్తిడి వల్ల ఏర్పడ్డ మనస్పర్థల వల్లే సి ఆర్ పి ఎఫ్ 39 వ బెటాలియన్ లోని ఎస్సై ఉమేష్ చంద్రపై, హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో నక్సల్స్ కోసం అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం, సరిహద్దు ప్రాంతంలో గస్తీ నిర్వహించడం,నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు జరుపుతూ ,బందోబస్తు నిర్వహించే క్రమంలో పని భారం పెరిగి,ఇరువురిలో మనస్పర్థలు కలిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..