Saturday, November 23, 2024

Tweet: కేంద్రంపై మండిప‌డ్డ కేటీఆర్‌.. అవ‌న్నీ విశ్వ‌గురుకే అర్థ‌మ‌యిత‌య్ అని ఆగ్రహం

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు తెలంగాణ మంత్రి, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ప్ర‌ధాని మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు దేశంలో ఎవ‌రికీ అంతుచిక్క‌కుండా ఉన్నాయ‌ని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రైతు చ‌ట్టాల‌ను రైతులు అర్థం చేసుకోలేదు, జీఎస్టీని వ్యాపారులు అర్థం చేసుకోలేదు.

పెద్ద‌నోట్ల ర‌ద్దును సామాన్యులు అర్థం చేసుకోలేదు. సిటిజ‌న్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)ని ముస్లింలు అర్థం చేసుకోలేదు. గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర పెంచితే మ‌హిళ‌లు అర్థం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడేమో అగ్నిప‌థ్ పేరుతో కొత్త ప‌థ‌కం తీసుకోస్తే యువ‌త అర్థం చేసుకోవ‌డంలేదు.

కానీ, విశ్వ‌గురు అనే వ్య‌క్తికి మాత్ర‌మే తాము చేసేవ‌న్ని రైట్ అని.. దేశంలో వారే గొప్ప‌గా చేస్తున్నార‌ని అర్థ‌మైతాంది.. అని మంత్రి కేటీఆర్ తీవ్రంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ య‌మ స్పీడ్‌గా వైర‌ల్ అవుతోంది..

❇️ Farmers don’t understand #FarmLaws
❇️ Traders don’t understand #GST
❇️ Common man doesn’t understand #Demonetisation
❇️ Muslims don’t understand #CAA
❇️ Homemakers don’t understand #LPG prices
❇️ Now youth don’t understand #Agniveer

Advertisement

తాజా వార్తలు

Advertisement