Tuesday, November 26, 2024

రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటలు.. పులులు, వాటి పిల్లలకు ప్రమాదం.. రంగంలోకి ఆర్మీ

రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ లోని అక్బర్‌పూర్ అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే ఇది అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్లతో సహా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే.. ఈ భారీ అగ్నిప్రమాదం వల్ల అడవిలోని పులికి, ఇటీవలే డెలివరీ అయిన దాని పిల్లలకు హాని జరుగుతుందని అటవీ రిజర్వ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ-17 అనే కోడ్‌నేమ్‌తో ఉన్న ఈ పులి ఇటీవలే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. జంతువులను సురక్షితంగా ఉంచేందుకు అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అంతకుముందు మరొక పులి, ఒక మగ – ST-13 అనే కోడ్‌నేమ్ – తప్పిపోయింది. ST-13 యొక్క రేడియో కాలర్ కొంతకాలం క్రితం పనిచేయలేదు. అటవీ అధికారులు దాని కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) నుండి అనుమతి కోసం వేచి చూస్తున్నారు.

ఇక ST-13 అనే పులి రెండు నెలలనుంచి కనిపించడం లేదు. దానికి ఏమి జరిగి ఉంటుందనే దానిపై సరిస్కా అధికారులు ఆరా తీస్తున్నారు. అది చాలా పిల్లలకు జన్మనిచ్చినందున రిజర్వ్ కు ఎంతో ముఖ్యమైనదిగా వారు భావిస్తున్నారు. ఆదివారం రిజర్వ్ లో చెలరేగిన మంటలు ఇప్పుడు దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలోకి వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 200 మంది జిల్లా అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయం కోసం ఆర్మీని కూడా పిలిపించారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement