ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్లాస్టిక్ క్యాన్ లో పెట్రోల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. కర్నాటకలోని తమకూరు జిల్లా మధుగిరి తాలూకా లోని దొడ్డెరి దగ్గర ఒక పెట్రోల్ బంకు (బడవనహళ్ళి చెక్ పోస్టు వద్ద) వద్ద చోటు చేసుకున్న ప్రమాదం ఆలస్యంగా బయటకు వచ్చింది. 46ఏళ్ల రత్తమ్మ.. 18 ఏళ్ల భవ్య ఇద్దరు తల్లీ కూతుళ్లు. వీరు తమ ఇంటి వద్ద లూజ్ పెట్రోల్ ను అమ్ముతుంటారు. దీని కోసం పెద్ద ప్లాస్టిక్ క్యాన్ లో పెట్రోలో కొట్టించుకొని విడిగా అమ్ముకుంటూ ఉంటారు. తాజాగా మోడ్ మీద ఖాళీ క్యాన్ ను మధ్యాహ్నం వేళలో పెట్రోల్ బంకుకు తీసుకొచ్చారు. క్యాన్ లో పెట్రోలో పోసే వేళలో.. మోపెడ్ మీద కొంత పెట్రోల్ ఒలికింది. అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం.. మోపెడ్ కాలుతూ ఉండటంతో దాని మీద పడిన పెట్రోల్ తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో.. తల్లీకూతుళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటల్ని ఆర్పేసి.. దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కుమార్తె భవ్య మరణించగా.. గాయాలబారిన పడిన రత్తమ్మ కోలుకుంటోంది.ఆమెకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement