Saturday, November 23, 2024

ఎలక్ట్రిక్‌ వాహనాల కంటైనర్‌లో ఫైర్‌.. కాలి బూడిదైన 20 స్కూట‌ర్లు (వీడియో)

ఎలక్ట్రికల్‌ వాహనాలను తరలిస్తున్న ఓ కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో 20 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని ముంబై – ఆగ్రా జాతీయ రహదారిపై జ‌రిగింది. ప్రమాద సమయంలో 40 వాహనాలు ఉండగా.. 20 వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఫఠార్డి ఫాటా సమీపంలో జరిగిందని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, మంటలకు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదని, విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ స్కూటర్‌లన్నీ జితేంద్ర ఎలక్ట్రిక్స్‌కు చెందినవి. ఇటీవలకాలం దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మంటల్లో చిక్కుకున్న వార్తలున్నాయి. ఈ ఘటన ఐదోది కాగా.. మార్చి 26న పూణెలోని ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. అదే రోజు తమిళనాడులోని వేలూరులో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధమై ఇద్దరు మృతి చెందారు. మార్చి 28న తమిళనాడులో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకోగా, మరుసటి రోజు చెన్నైలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement