Monday, November 25, 2024

Fire | కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఫైర్‌.. మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం

ఆంధ్రప్రభ, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో అగ్ని ప్ర‌మాదం త‌లెత్తింది. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో మూడు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క బోగీలకు వ్యాపించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. రైల్వే స్టేషన్‌ మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

- Advertisement -

రైలు ఉదయం 7 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిందని అధికారులు తెలిపారు. మెయింటేనెన్స్‌ అనంతరం దానిని తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా వినియోగిస్తారని చెప్పాయి. ఈ క్రమంలో ఉదయం 10.10 గంటల సమయంలో రైలులోని జీ-7 బోగీలో మంటలు చెలరేగాయని, సిబ్బంది వాటిని ఆర్పేలోగా ఇదర బోగీలకు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్య్కూట్‌ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement