ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అమేథిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని మంటలంటుకుంది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో కారులో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినా, అప్పటికే ముగ్గురు సజీవ దహనమయ్యారు. అయితే, కారులో ఉన్న వ్యక్తులను గుర్తించాల్సి ఉంది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో లక్నో నుంచి ఘాజీపూర్‌కు వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొన్న వెంటనే కారు మంటల్లో చిక్కుకుంది. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కారులోనే కాలిపోయి చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.